మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Sabarigirivasa Stotram – శ్రీ శబరిగిరివాస స్తోత్రం
శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం
శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసమ్ |
కలితరిపునిరాసం కాంతముత్తుంగనాసం
నతినుతిపరదాసం నౌమి పింఛావతంసమ్ || 1 ||
శబరిగిరినిశాంతం శంఖకుందేందుదంతం
శమధనహృదిభాంతం శత్రుపాలీకృతాంతమ్ |
సరసిజరిపుకాంతం సానుకంపేక్షణాంతం
కృతనుతవిపదంతం కీర్తయేఽహం నితాంతమ్ || 2 ||
శబరిగిరికలాపం శాస్త్రవద్ధ్వాంతదీపం
శమితసుజనతాపం శాంతిహానైర్దురాపమ్ |
కరధృతసుమచాపం కారణోపాత్తరూపం
కచకలితకలాపం కామయే పుష్కలాభమ్ || 3 ||
శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం
శకలితదితిజాతం శత్రుజీమూతపాతమ్ |
పదనతపురహూతం పాలితాశేషభూతం
భవజలనిధిపోతం భావయే నిత్యభూతమ్ || 4 ||
శబరివిహృతిలోలం శ్యామలోదారచేలం
శతమఖరిపుకాలం సర్వవైకుంఠబాలమ్ |
నతజనసురజాలం నాకిలోకానుకూలం
నవమయమణిమాలం నౌమి నిఃశేషమూలమ్ || 5 ||
శబరిగిరికుటీరం శత్రుసంఘాతఘోరం
శఠగిరిశతధారం శష్పితేంద్రారిశూరమ్ |
హరిగిరీశకుమారం హారికేయూరహారం
నవజలదశరీరం నౌమి విశ్వైకవీరమ్ || 6 ||
సరసిజదళనేత్రం సారసారాతివక్త్రం
సజలజలదగాత్రం సాంద్రకారుణ్యపాత్రమ్ |
సహతనయకళత్రం సాంబగోవిందపుత్రం
సకలవిబుధమిత్రం సన్నమామః పవిత్రమ్ || 7 ||
ఇతి శ్రీ శబరిగిరివాస స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.